Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications

దళిత యువకుడి పై దాడిని ఖండించిన విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డి ఏడుకొండలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

దళిత యువకుడి పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డిఏడుకొండలు

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, తాళ్ళరేవు, సుంకరపాలెం

దళిత యువకుడు దోనుపాటి మహేష్ పై విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డి ఏడుకొండలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగాయని బుధవారం సుంకరపాలెం బాబా నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిద్ధార్థ స్టూడెంట్ యూత్ అసోసియేషన్ మరియు గ్రామ పెద్దలు విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డి ఏడుకొండలు ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం అమలులో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అందువల్ల దళితులపై దాడులు ఎక్కువ జరుగుతున్నాయని అన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల స్వాహా చేసి వారిని వదిలేసి మధ్యవర్తిగా ఉన్న దళిత యువకుడు దొనపాటి మహేష్ పై దాడి చేయడం దారుణం అని ప్రైవేటు కాలేజీలకు సంబంధించిన సిబ్బంది కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులు అని చెప్పుకుంటూ ఉద్యోగాలు ఇప్పిస్తామని దందా చేస్తూ అనేక మంది దగ్గర నుంచి లక్షల స్వహచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తామని ఒక వ్యక్తి నుంచి 2 లక్షల తీసుకుని ఉద్యోగం వెయ్యకపోగా మధ్యవర్తిగా ఉన్న దళిత యువకుడు దోనపాటి మహేష్ పై దాడి చేసిన ఎల్లమెల్లి విజయ్ అతనితో ఉన్న పాటు 15 మందిని కఠిన చర్యలు తీసుకోవాలని,ఈ సంఘటనపై మంత్రి వాసంశెట్టిసుభాష్ ఈ దాడి పై స్పందించాలన్నారు. ఈ సమావేశంలో సిద్ధార్థ యూత్ సభ్యులు నాగాబత్తులశ్రీనివాస్, వాకపల్లివీరబాబు,కోరుకొండ కోటేశ్వరరావు,రేవుపేరయ్య,మర్రి అశోక్,వడ్డిఅంబేద్కర్, గ్రామ పెద్దలు,వడ్డివెంకటేశ్వర్లు, నాగాబత్తులవిశ్వనాథం, ముసలి అప్పారావు,మోర్తవెంకన్న తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo