మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు మండపేటలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అఖిలభారత చిరంజీవి యువత మండపేట అధ్యక్షులు కొంతం ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండపేట ఆదర్శ హెల్పింగ్ హాండ్స్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించి కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం శెట్టి రవి మాట్లాడుతూ మెగాస్టార్ సినీ రంగానికి పెద్దగా ఉంటూనే తన అభిమానాలను తమ్ముళ్లుగా చూసుకునే ఆయన తీరు ఆదర్శనీయం అన్నారు. ఆయన అభిమానులుగా పుట్టడం తమ అదృష్టంగా భావించారు. ఈ కార్యక్రమంలో మొరం బాలాజీ , గోపికృష్ణ సాయి, బండారు సతీష్, మోటుపల్లి వీరబాబు, వైజయంతి రాజు, నిమ్మ రమేష్, చోడిశెట్టి దుర్గాప్రసాద్, మామిడాల మనో కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

