25 October 2025
Saturday, October 25, 2025

దొంగ ఓట్లు తొలగించి అర్హులకు ఓట్లు కల్పించాలి…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

దొంగ ఓట్లు తొలగించి అర్హులకు ఓట్లు కల్పించాలి…

కామన ప్రభాకరరావు ఆద్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ…

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

దేశంలో దొంగ ఓట్లు తో బీజేపీ ప్రభుత్వం గద్దె నెక్కిందని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావు విమర్శించారు. కామన ప్రభాకరరావు నేతృత్వంలో మండపేట లో శుక్రవారం రాత్రి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించారు. మండపేట ఏడిద రోడ్ లోని కాంగ్రెస్ కార్యాలయం నుండి కలువపువ్వు సెంటర్ వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా కామన ప్రభాకరరావు మాట్లాడుతూ దేశంలో మోదీ దోపిడి పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కుంభకోణాన్ని బయట పెట్టారన్నారు. చనిపోయినట్లు ఉన్న ఓటర్లతో టీ తాగి ఈ దేశానికి ఎన్నికల కమిషన్ చేస్తున్న ద్రోహాన్ని ప్రశ్నించారని పేర్కొన్నారు. ప్రస్తుతం బీహార్ లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి అర్హులైన ఓట్లను లక్షల్లో తొలగిస్తున్నారని ఆరోపించారు. దీనికి నిరసనగా తమ నాయకుడు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. దీనికి మద్దతుగా దేశవ్యాప్త కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు శుక్రవారం మండపేటలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. బీహార్లో ఒక సాధువు ఇంట్లో 70 ఓట్లు ఉన్నాయని ఇదెక్కడ అన్యాయమని ప్రశ్నించారు. దొంగ ఓట్లతో ప్రజాస్వామ్యాన్ని అపహస్యపాలు చేస్తున్నారని విమర్శించారు. భారతదేశంలో పారదర్శకంగా ఎన్నికల సంఘం పనిచేయాల్సి ఉండగా ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరించడం తగదని హెచ్చరించారు. ఎన్నికల కమిషనర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహిస్తేనే దేశానికి మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ విషయాలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. దొంగ ఓట్లతో రాజ్యమేలుతున్న కార్పొరేట్ కు కొమ్ముకాస్తున్న మోడీ సర్కారు పతనం కాక తప్పదని హెచ్చరించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మగ్గం జాకబ్ రాజు, పాడిశెట్టి సత్యనారాయణ, ముగళ్ళ శ్రీను, అలమండ సూరిబాబు, గెద్దాడ వీరబ్రహ్మం, గండ్రోతుల రామచంద్రరావు, వాసిరెడ్డి బాబురావు, పిల్లి అప్పన్న, ఉండ్రాజపు రాంబాబు, సుంకర ప్రకాష్ కుడిపూడి చిరంజీవి, రామిశెట్టి సారయ్య, పర్వతిన వీర వెంకట్రావు చౌదరి, పసుపులేటి పెదకాపు, కే నాగు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
తెలంగాణ
అలూరి సీతారామరాజు
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo