ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా సానా సతీష్ బాబు నామినేషన్ దాఖలు
ఈ నెల 16వ తేదీన జరగనున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 2025-2028 ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు ప్రక్రియ మొదలైంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా రాజ్యసభ సభ్యులు, సానా సతీష్ బాబు ఆదివారం మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి చాంబర్లో తన నామినేషనన్ను దాఖలు చేసారు. తన అభిమానులు, స్నేహితులతో కలిసి సానా సతీష్ బాబు తరలి వెళ్ళి నామినేషన్ పత్రలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సమర్పించారు.