14 October 2025
Tuesday, October 14, 2025

ఆంధ్రప్రదేశ్ వార్తలలోని ఈరోజు ముఖ్యాంశాలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ వార్తలలోని ఈరోజు ముఖ్యాంశాలు

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, ఆంధ్రప్రదేశ్

🌞ఏపీలో ఏడుగురు IAS అధికారుల బదిలీ

▪నెల్లూరు జిల్లా కందుకూరు సబ్‌కలెక్టర్‌గా దమీరా హిమవంశీ బదిలీ
▪మన్యం జిల్లా పాలకొండ-పవార్ సప్నిల్‌, ఏలూరు జిల్లా నూజివీడు-బొల్లిపల్లి వినూత
▪అన్నమయ్య మదనపల్లి-చల్లా కల్యాణి, రాజంపేట- HS భావన బదిలీ
▪అల్లూరి జిల్లా రంపచోడవరం-శుభం నొక్వల్‌, పార్వతీపురం-ఆర్ వైశాలి బదిలీ.

🌞ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు దరఖాస్తు గడువు పెంపు
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును 10/08/2025 అర్ధరాత్రి 11.59 గంటల వరకు పొడిగిస్తూ APPSC నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో (ttps://psc.ap.gov.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

🌞ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినHRA ఏడాది పొడిగింపు – 2022లో హౌస్ రెంట్ అలవెన్స్ 24%పొడిగించిన ప్రభుత్వం – పెంచిన HRA మరో ఏడాది పాటు పొడిగింపు – సచివాలయ ఉద్యోగులు, శాఖాధిపతులకు వర్తింపు.

🌞రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష -పాలనలో పీపుల్, విజన్, నేచర్, టెక్నాలజీకి ప్రాధాన్యత – నాణ్యమైన జీవన ప్రమాణాలే లక్ష్యంగా ప్రణాళికలు – ప్రతి విభాగానికి ఓ ఇండికేటర్ ఉండాలి – ఇండికేటర్ ఉంటేనే ఉత్తమ ఫలితాలు సాధించగలం – నీతి ఆయోగ్ తరహాలో ప్రణాళికా విభాగం డ్రైవ్ చేయాలి – వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆగస్టు 15 నుంచి 700 సేవలు : సీఎం చంద్రబాబు

🌞సెప్టెంబర్ 1 నుంచి నూతన బార్ పాలసీ – కేబినెట్ సబ్‌కమిటీ నివేదిక ఆధారంగా కొత్త బార్ పాలసీ – ఆదాయమే కాదు… ప్రజల ఆరోగ్యమూ ముఖ్యమే – ఆల్కహాల్ తక్కువ గల మద్యం విక్రయాలతో నష్టం తగ్గించవచ్చు – మద్యం వల్ల పేదల ఇల్లు, ఒళ్లు గుల్ల కాకుండా చూడాలి – బార్ల కేటాయింపులోనూ గీత వర్గాలకు 10 శాతం షాపులు : సీఎం చంద్రబాబు

🌞విజయవాడ : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మండలి వెంకటకృష్ణారావు శతజయంతి వేడుకలు – శతజయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు – మండలి వెంకటకృష్ణారావు జనం గుండెల్లో నిలిచిపోతారు – దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన సేవను మర్చిపోలేం – తెలుగు భాష కోసం విశేషమైన కృషి చేశారు – ప్రపంచ తెలుగు మహాసభల్ని అద్భుతంగా నిర్వహించారు – మండలి వెంకటకృష్ణారావు డబ్బుల కోసం ఎప్పుడూ ఆశపడలేదు – ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాలను మండలి వెంకటకృష్ణారావు పేదలకు ఇచ్చేశారు : సీఎం చంద్రబాబు

🌞ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ మృతిపట్ల చంద్రబాబు సంతాపం – శిబూ సోరెన్ మరణ వార్త బాధ కలిగించింది – గిరిజనుల సాధికారత కోసం శిబూ సోరెన్ అవిశ్రాంతంగా కృషి చేశారు – శిబూ సోరెన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి : సీఎం చంద్రబాబు

🌞ఆదోని హైస్కూల్లో నో అడ్మిషన్ బోర్డు చూసి ఆనందించా – విద్యార్థుల చేరికతో ప్రభుత్వ విద్యపట్ల ప్రజల్లో నమ్మకానికి నిదర్శనం – ప్రతి స్కూలులో ఇలాగే నో అడ్మిషన్ బోర్డులు కనిపించాలి – తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్యపట్ల నమ్మకం కల్పించిన టీచర్లే ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దే రథసారధులు : మంత్రి నారా లోకేష్.

🌞మంత్రి నారా లోకేష్ ను కలిసిన నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు – ఎంఈవో పోస్టుల్లో జిల్లా పరిషత్ టీచర్లకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి – టీచర్ల ప్రతి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి నారా లోకేష్ హామీ – విద్యలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో టీచర్లే కీలకం : మంత్రి నారా లోకేష్.

🌞ఆపరేషన్ కుంకీతో సరిహద్దు ప్రాంత రైతులకి భరోసా – కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతం – పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులను కుంకీలు దారి మళ్లించాయి – తొలి ఆపరేషన్ విజయవంతం చేసిన అధికారులు, సిబ్బందికి అభినందనలు : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

🌞ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరేన్ మృతిపట్ల లోకేష్ దిగ్భ్రాంతి – గిరిజనుల కోసం శిబూ సోరేన్ చేసిన పోరాటం ఎప్పటికీ గుర్తుంటుంది – శిబూ సోరేన్ కుటుంబసభ్యులకు, అనుచరులకు నా సానుభూతి : మంత్రి నారా లోకేష్.

🌞ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం – బార్లలో కూడా 10 శాతం షాపులు కల్లు గీత కార్మికులకు కేటాయింపు – ఇప్పటికే లిక్కర్ షాపుల్లో 10 శాతం కల్లుగీత కార్మికులకు కేటాయింపు – ఇప్పుడు బార్ లైసెన్స్‌లో కూడా ప్రాధాన్యత.

🌞విశాఖ : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు – ఏసీఏ అధ్యక్ష పదవికి, సెక్రెటరీ పదవికి ఒక్కో నామినేషన్ దాఖలు – ఏసీఏ అధ్యక్ష పదవికి ఎంపీ కేశినేని చిన్ని నామినేషన్ దాఖలు – ఈ నెల 16న అధికారిక ప్రకటన చేయనున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్.

🌞నెల్లూరు జిల్లా వరికుంటపాడులో టీడీపీ నాయకుడు షేక్ పీరయ్యకు గుండెపోటు – గుండెనొప్పితో ప్రకాశం జిల్లా పామూరు ఆస్పత్రికి పీరయ్య తరలింపు – మూడు రోజులుగా పోలీసుల విచారణకు హాజరవుతున్న పీరయ్య – మైనింగ్ వద్దంటూ గ్రామస్థుల నిరసనలో పాల్గొన్న షేక్ పీరయ్య – ఇవాళ పోలీసుల విచారణ సమయంలో కుప్పకూలిన పీరయ్య – పోలీసుల వేధింపుల వల్లే గుండెనొప్పి వచ్చిందని బంధువుల ఆరోపణ – మైనింగ్ వద్దు గ్రామమే ముద్దు కార్యక్రమంలో పాల్గొన్న పీరయ్య.

🌞తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొలుసు పార్థసారథి – వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్న మంత్రి పార్థసారధి – భగవంతుని ఆశీస్సులతో రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉంది – వ్యవసాయం, పాడి పంటలు బాగుండాలని ప్రార్థించా – విజన్ 2047, రాష్ట్రాభివృద్ధికి కష్టపడుతున్న సీఎం ఆలోచనలు నెరవేరాలి : మంత్రి కొలుసు పార్థసారథి.

🌞మద్యం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ – ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలజీ, మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్లలో కౌంటర్ దాఖలు చేసిన సిట్ – కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్‍పై తదుపరి విచారణ ఈనెల 6కి వాయిదా – ధనుంజయరెడ్డి, గోవిందప్ప బాలాజీ బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా – మద్యం కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‍లో ఉన్న ధనుంజయరెడ్డి, గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి – రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్‍లో ఉన్న మిథున్ రెడ్డి.

🌞ప్రకాశం జిల్లాలో మంత్రులు గొట్టిపాటి రవి, డీఎస్‌బీవీ స్వామి పర్యటన – కంభం, గిద్దలూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు – మంత్రుల వెంట ఎమ్మెల్యేలు ఉగ్రనరసింహారెడ్డి, అశోక్ రెడ్డి, నారాయణ రెడ్డి – సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టిన నేతలు – జగన్ ఐదేళ్లు.. స్కామ్‌ల కోసమే స్కీమ్‌లు పెట్టారు – నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారు – నాసిరకం మద్యంతో భారీ స్కామ్ కు పాల్పడ్డారు – తన స్వార్థం కోసం ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటమాడారు : మంత్రి గొట్టిపాటి రవికుమార్.

🌞తమిళనాడు రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా వాసుల మృతి పట్ల మండిపల్లి దిగ్భ్రాంతి – చికిత్స కోసం చెన్నై ఆస్పత్రికి వెళ్తుండగా ప్రమాదం జరగడం బాధాకరం – మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

🌞గుంటూరు: తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం – కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించిన మంత్రి కొండపల్లి – చంద్రబాబుపై నమ్మకంతో రాష్ట్రం కోసం భూమి ఇవ్వడం ఓ చరిత్ర – 2019లోనూ అధికారంలోకి వచ్చి ఉంటే రాజధాని మరింత అభివృద్ధి చెందేది- గత ఐదేళ్లు రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో స్వయంగా చూశాం -మూడు రాజధానులకు వ్యతిరేకంగా చేసిన మీ పోరాటం ఓ చరిత్ర : మంత్రి కొండపల్లి శ్రీనివాస్.

🌞నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన మాజీ మంత్రి అనిల్ – ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న అనుచిత వ్యాఖ్యల కేసులో అనిల్‍ను ప్రశ్నిస్తున్న పోలీసులు- ఇదే కేసులో ప్రసన్నకుమార్ రెడ్డి తోపాటు మరో ముగ్గురిని విచారించిన పోలీసులు.

🌞ఢిల్లీ పర్యటనలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు – రాష్ట్రపతి ముర్మును మర్యాదపూర్వకంగా కలిసిన అశోక్ గజపతిరాజు – పార్లమెంట్‍లో ప్రధాని మోదీని కలిసిన గవర్నర్ అశోక్ గజపతిరాజు.

🌞ఢిల్లీ : కేంద్రమంత్రి హర్దీప్‍సింగ్‍ను కలిసిన టీడీపీ ఎంపీల బృందం – ఏపీలోని పెట్రోలియం, గ్యాస్ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని కోరిన ఎంపీలు – రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు వేగవంతం చేయాలన్న టీడీపీ – జాక్-అప్ రిగ్ కాంట్రాక్టుకు హిందూస్తాన్ షిప్‍యార్డును పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి.

🌞విజయవాడ: డ్వాక్రా మహిళల కోసం బెస్ట్ మార్ట్‌తో మెప్మా ఒప్పందం – డ్వాక్రా మహిళల ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో విక్రయానికి వీలుగా ఒప్పందం – కార్యక్రమంలో పాల్గొన్న మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్, ఎమ్మెల్యే బోండా ఉమా.

🌞సీజ్ చేసిన రూ.11 కోట్లు బ్యాంకు డిపాజిట్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణ – రాజ్ కెసిరెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ కోర్టు – కోర్టు ఉత్తర్వులు తీసుకెళ్లేసరికి నగదు చెస్ట్ బ్రాంచ్‌కు పంపినట్లు కెసిరెడ్డి తరపు వాదనలు – చెస్ట్ బ్రాంచ్‌కు నగదు పంపినట్లు మాచవరం ఎస్‌బీఐ మేనేజర్ తెలిపారన్న కెసిరెడ్డి న్యాయవాది – ఇతర నగదుతో రూ.11 కోట్లు కలపొద్దని ఈనెల 2న ఏసీబీ కోర్టు ఉత్తర్వులు – సీసీ కెమెరా దృశ్యాలు భద్రపరిచేలా ఆదేశాలివ్వాలని కోరిన కెసిరెడ్డి తరపు న్యాయవాది – నగదు బ్యాంకుకు.. బ్యాంకు నుంచి చెస్ట్ బ్రాంచ్‌కు తరలింపు దృశ్యాలు భద్రపరచాలని మెమో – విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన కెసిరెడ్డి తరపు న్యాయవాది.

🌞జైళ్ల శాఖలో సంస్కరణలపై హోంమంత్రి అనిత సమీక్ష – సత్ర్పవర్తన కలిగిన భైదీల విడుదలపై అధికారులతో అనిత చర్చ – జైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, ఖాళీ పోస్టుల భర్తీపై చర్చించిన అనిత – జైళ్లలో మౌలిక వసతుల కోసం నిధుల విడుదలకు హోంమంత్రి అనిత నిర్ణయం.

🌞అనకాపల్లి : పరవాడ ఫార్మాసిటీలోని లూపిన్ ఫార్మా కంపెనీలో ప్రమాదం – విషవాయువులు లీకై ఐదుగురు కార్మికులకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు – అస్వస్థతకు గురైన కార్మికుల్లో నలుగురి పరిస్థితి విషమం.

🌞అమరావతి : కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం హాజరైన మంత్రులు రాంప్రసాద్‌రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యారాణి – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సబ్‌కమిటీలో చర్చ – ఉచిత ప్రయాణం పథకానికి మార్గదర్శకాలు రూపొందిస్తోన్న సబ్‌కమిటీ – పథకం సమర్థవంతంగా అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ – ‘స్త్రీశక్తి’ పథకారనికి రేపు ఏపీ కేబినెట్‌ సమావేశంలో ఆమోదముద్ర – ఈ నెల 15న ‘ స్త్రీశక్తి’ని లాంఛనంగా ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం.

🌞నెల్లూరు : క్వార్ట్జ్ గనుల్లో తవ్వకాలను వ్యతిరేకిస్తున్న స్థానికులు – వరికుంటపాడు మండలం లింగంరెడ్డిపల్లె, భాస్కరాపురం సమీపంలో గనులు – జగన్ హయాంలో వైసీపీ నేత వెంకటరెడ్డికి మైనింగ్ అనుమతులు – స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కితగ్గిన వైసీపీ నేత – ఇటీవల ఆందోళనలను ఉధృతం చేసిన స్థానికులు – వరికుంటపాడు వాసిని పీఎస్‌కు పిలిపించి పోలీసుల బెదిరింపులు – పీఎస్‌లో గుండెపోటుతో కుప్పకూలిన పీరయ్య – పీఎస్‌ను ముట్టడించిన 5 గ్రామాల ప్రజలు.

🌞ప్రధాని మోదీని కలిసిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ – ప్రధాని మోదీని మర్యాద పూర్వకంగా కలిసిన పెమ్మసాని – ప్రధాని మోదీని కుటుంబసభ్యులతో పాటు కలిసిన పెమ్మసాని – మోదీ దూరదృష్టి గల నాయకత్వం, అంకితభావం, వినయ శీలతతో కూడిన వ్యక్తిత్వం మమ్మల్ని ప్రభావితం చేసింది – ఈ క్షణాలు మాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి : కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.

🌞రోడ్ల నిర్మాణంలో అధునాతన టెక్నాలజీ ‘స్టీల్ స్లాగ్’ విధానానికి శ్రీకారం – ‘స్టీల్ స్లాగ్’ విధానానికి శ్రీకారం చుట్టిన మంత్రి బీసీ.జనార్ధన్‌రెడ్డి – మందడంలో రోడ్ల మరమ్మతులకు ‘స్టీల్ స్లాగ్’ విధానానికి జనార్ధన్‌రెడ్డి శ్రీకారం -‘స్టీల్ స్లాగ్’ విధానంలో స్టీల్‌ప్లాంట్ వ్యర్థాల మిశ్రమాల ద్వారా రోడ్ల నిర్మాణం, మరమ్మతులు.

🌞ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – : మంత్రి మండిపల్లి – ‘స్త్రీ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు – సమర్థంగా పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నాం – రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు – పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సీటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం – 6,700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు – ఉచిత ప్రయాణం కోసం రూ.1,950 కోట్ల వ్యయం అవుతుంది – 3 వేల విద్యుత్ బస్సుల కొనుగోలుకు సీఎం ఆదేశించారు – వచ్చే రెండేళ్లలో 1400 ఎలక్ట్రిక్ బస్సులో కొనుగోలు చేస్తాం – మహిళలు ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్‌కార్డు ఏదొకటి చూపించాలి – రద్దీ పెరిగితే.. స్కూళ్ల బస్సులను వినియోగిస్తాం – పాఠశాల వేళల్లో స్కూల్ బస్సులు వినియోగించబోము – డ్రైవర్లు, మెకానిక్‌ల నియామకాలు రెండ్రోజుల్లో చేపడతాం – ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపడతాం : మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి.

🌞మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులు అందించిన ప్రత్తిపాటి – రూ.5 లక్షలు బీమా చెక్కులు అందజేసిన మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు – చంద్రన్న బీమా టీడీపీ కార్యకర్తలకు గొప్ప ధీమా – కార్యకర్తల సంతోషం, సంక్షేమం చంద్రబాబుకు ముఖ్యం : మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.

🌞పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడుతున్న వైసీపీ నేతలు – పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ నాయకులను బెదిరిస్తున్న వైసీపీ నేతలు – వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని పోలీసులకు టీడీపీ నేత విశ్వనాథరెడ్డి ఫిర్యాదు – ఇటీవలే పార్టీ మారిన పులివెందుల మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథరెడ్డి – విశ్వనాథరెడ్డి పార్టీ మారడంపై తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగిన వైసీపీ నేతలు.

🌞కర్నూలు : పత్తికొండ సమీపంలో ఆటో బోల్తా, ఐదుగురికి తీవ్రగాయాలు – పత్తికొండ మార్కెట్‌లో కూరగాయలు విక్రయించి తిరిగి వెళ్తుండగా ప్రమాదం – క్షతగాత్రులకు పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స.

🌞బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు సబబు కాదు – సముద్రంలో కలిసే నీటినే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా మళ్లింపు – ఏపీకి ఉన్న హక్కుతోనే బనకచర్ల ప్రాజెక్టు రూపకల్పన – గోదావరిలో 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తుంది – బనకచర్లతో రాయలసీమ సస్యశ్యామలమే చంద్రబాబు లక్ష్యం – సముద్రంలోకి వెళ్లే నీటి వినియోగంపై ఏపీకి సర్వహక్కులు : మంత్రి ఫరూక్.

🌞కడప జిల్లా మైదుకూరులో నాఫెడ్ గోదాం నిర్మాణానికి భూములు కేటాయింపు – భూములు కేటాయించిన ప్రభుత్వానికి మంత్రి సత్యకుమార్ ధన్యవాదాలు – గత ప్రభుత్వం భూములు కేటాయించకుండా అడ్డుకుంది – కడప జిల్లా రైతన్నలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది – రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి సత్యకుమార్.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo