Wednesday, August 6, 2025
🔔 10
Latest Notifications
Wednesday, August 6, 2025
🔔 10
Latest Notifications

ఆదాని ప్రీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్రజావేదిక వద్ద ధర్నా

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఆదాని ప్రీ పైడ్ స్మార్ట్ మీటర్లను వ్యతిరికిస్తూ ప్రజావేదిక వద్ద ధర్నా : ఏపీ కౌలు రైతు సంఘం నాయకులు వళ్ళు రాజబాబు

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాజులూరు, గొల్లపాలెం

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు పాటిస్తూ, ప్రజలపై భారాలు వేసేందుకు సిద్ధమై స్మార్ట్ మీటర్ల పేరుతో ఆదాని కంపెనీకి లాభం చేకూర్చేందుకు బిగిస్తున్న స్మార్ట్ మీటర్లను వ్యాపార సంస్థలు మరియు సామాన్య ప్రజానికం వ్యతిరేకించాలని కోరుతూ మంగళవారం కాజులూరు ప్రజా వేదిక ఆధ్వర్యంలో గొల్లపాలెం పవర్ సెక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్, వల్లు రాజబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదాని కంపెనీకి లాభం చేకూర్చేందుకు ఈ స్మార్ట్ మీటర్ల ఒప్పందం కుదుర్చుకుందని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రయత్నిస్తే ప్రజలు వ్యతిరేకించారని, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి, ఇప్పుడు అధికారంలోకి రాగానే స్మార్ట్ మీటర్లను బిగించేందుకు సిద్ధమైందని,ఇది సామాన్య ప్రజన్నికంపై భారం వేసేందుకేనని వారు అన్నారు.ప్రభుత్వాలు ప్రజల ముక్కు పిండి పన్నులు వసూలు చేసి ఆదానీ కంపెనీకి లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.ఈ స్మార్ట్ మీటర్లు అమల్లోకి వస్తే, స్మార్ట్ మీటర్ ఖరీదు దశలవారీగా వినియోగదారుడు భరించాలన్నారు.అలాగే ప్రీపెయిడ్ ద్వారా ముందే రీఛార్జ్ చేసుకోవాలని, పీక్ హవర్స్ లొ చార్జీలు పెరుగుతాయని ఒప్పందాలు లొ ఉందని భవిష్యత్తులో ఇటువంటి అనేక కష్టాలు స్మార్ట్ మీటర్ల ద్వారా రాబోతున్నాయని వారు తెలియచేసారు. ప్రజానీకం,వ్యాపార వర్గాలు అందరూ వ్యతిరేకించి బిగించిన స్మార్ట్ మీటర్లు వెంటనే వెనక్కి తీసుకోవాలనిడిమాండ్ చేస్తూ పిలుపునిచ్చారు. అలాగే ఇప్పటికే నాలుగు రకాల చార్జీల పేరుతో వసూలు చేస్తున్న చార్జీలను రద్దు చేసి కరెంట్ చార్జీలు తగ్గించాలని వారు కోరారు. ఈ ధర్నా కార్యక్రమం లొ కోనసీమ బి సి సంఘం సమన్వయ కర్త కడలి రాంపండు, గొల్లపాలెం మాజీ సర్పంచ్ పోతురాజు బాబురావు, పితాని సుబ్రహ్మణ్యం మాజీ ఎం పి టీ సి,స్థానిక నాయకులు దంగేటి వెంకన్న, గురజాపు సత్యనారాయణ, వనుం వీర వెంకట సత్యనారాయణ, పి వీరబాబు, ముస్లిం మైనారిటీ నాయకులు షాజహాన్, కురుపూడి భూచక్రం, తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం విద్యుత్ కార్యాలయంలో మెమోరాండం అందజేశారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తూర్పు గోదావరి
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo