ఇంటి వద్దకే వికలాంగులకు,వృద్దులకు రేషన్…
ఎమ్మెల్యే వేగుళ్ల…
రాష్ట్ర అంచనాల కమిటి చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆద్వర్యంలో శనివారం మండపేట తహసిల్దార్ కార్యాలయం లో పలు ప్రభుత్వ పథకాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండపేట, రాయవరం కపిలేశ్వరపురం మండలాల తహశీల్దార్ లు, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్, అన్ని గ్యాస్ కంపెనీ ఏజెన్సీల యాజమాన్యలతో ఈ సమావేశం జరిగింది. దీపం-2 పథకం సబ్సిడీ సొమ్ము బ్యాంక్ ఖాతాకు జమ కాని వారి విషయమై సమీక్షా సమావేశం నిర్వహించారు. దీపం-2 పథకం లో మండపేట నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 81,819 మంది గ్యాస్ కనెక్షన్స్ ఉండగా 80,745 మందికి రూ. 6,87, 23, 306/- లు సబ్సిడీ మంజూరు అయినట్లు అధికారులు తెలిపారు. 80,491 మంది లబ్ధిదారులకు వారి బ్యాంక్ ఖాతాలకు రూ. 6,85,06,399/- లు సబ్సిడీ సొమ్ము జమ అయ్యాయని చెప్పారు. కేవలం 254 మందికి మాత్రమే వివిధ కారణాలతో జమ కాలేదన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జమ కానీ లబ్ధిదారులకు ఆయా గ్యాస్ కంపెనీ నిర్వాహకులు సహనంగా ఎందుకు నిలిచిపోయింది అనే విషయాన్ని వివరించాలని చెప్పారు.65 సం.లు పైబడిన వికలాంగులకు రేషన్ షాపు డీలర్లు స్వయంగా ప్రతీ నెలా కార్డుదారులు ఇంటికే నిత్యావసర సరుకులు పంపిణీని సమర్ధవంతంగా చేయాలని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆదేశించారు. తల్లికి వందనం పథకం పై లబ్ధిదారులకు పార్ట్ పేమెంట్ జమ పై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి,మండపేట తహసిల్దార్ పి.తేజేశ్వరరావు,రాయవరం తహసిల్దార్ ఐ. పి. శెట్టి,కపిలేశ్వరపురం తహసిల్దార్ జి.శ్రీనివాసు,డిప్యూటీ తహశీల్దార్ పి. ఎ. మెహర్ బాబా, పౌర సరఫరాల డిప్యూటీ తహశీల్దార్ సి హెచ్. గాయత్రి పద్మ, ఎంపిడిఓ కె.సత్యన్నారాయణ మూర్తి,మున్సిపల్ కమీషనర్ టి. వి.రంగారావు,మండల విద్యాశాఖాధికారి ఎన్. రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.