Monday, August 4, 2025
Monday, August 4, 2025

ద్రాక్షారామ గ్రామ ప్రజలకు తాగునిటీ సమస్య శాశ్వత పరిష్కారం 

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ద్రాక్షారామ గ్రామ ప్రజలకు తాగునిటీ సమస్య శాశ్వత పరిష్కారం

విశ్వం వాయిస్ న్యూస్, ద్రాక్షారామ

ద్రాక్షారామ గ్రామ ప్రజలకు తాగునిటీ సమస్య శాశ్వత పరిష్కారం

 

వాటర్ ట్యాంక్ పనులు వేగవంతం చేసిన మంత్రి సుభాష్

 

 

రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-మండలం ద్రాక్షారామ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోపల జల జీవన్ మిషన్ పనులను సర్పంచ్ కొత్తపల్లి అరుణ పరిశీంచారు. ఈ సందర్బంగా పని పనుల పురోగతిని తెలుసుకున్నారు.ప్రజల తాగునీటి అవసరాలకు రెండు లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నిర్మాణం డూమ్ టైప్ నిర్మాణం పూర్తికావస్తున్నదని,వచ్చే నెలలో దీని నుండి పూర్తిస్థాయిలో ద్రాక్షారామ పలు వార్డులకు పైగా ప్రజలకు త్రాగునీటి సమస్య తీరుతుందని తెలిపారు.ప్రభుత్వ అంచనా మరియు నివేదిక ప్రకారం ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల నీరు అవసరం అని,గ్రామంలో బండ్ల గేటు ఏరియాలో ఉన్న వాటర్ ట్యాంక్ ఒక లక్ష యాభై వేల లీటర్లు కెపాసిటీ ట్యాంక్ ఒకటే ఉందని,ఇంకొకటి నున్న వారి వీధిలో ఒక లక్ష ఇరవై వేల లీటర్ల ట్యాంకు వున్నా సరిపోవడం లేదన్నారు. అందుకే మూడవ ట్యాంక్ రెండు లక్షల లీటర్ల మంచినీటి ట్యాంక్ నిర్మాణంతో ద్రాక్షారామ గ్రామ ప్రజలకు పూర్తిస్థాయిలో మంచినీటి అవసరాలు తీరుతాయని ఆనందం వ్యక్తం చేశారు. రామచంద్రపురం నియోజవర్గ మంత్రి సుభాష్ కు ఈ జలజీవన్ మిషన్ ట్యాంక్ నిర్మాణం లో జరుగుతున్న జాప్యాన్ని తెలియజేసి ఈ ట్యాంక్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరిన వెంటనే సంబంధిత అధికారులతోనూ, కాంట్రాక్టర్లతోనూ మాట్లాడి వేరొక కొత్త కాంట్రాక్టర్ కి ఈ పనిని అప్ప చెప్పడం వలన త్వరితగతిన నిర్మాణపు పనులు వేగం పుంచుకున్నాయి. గతంలో సుభాష్ ద్రాక్షారామ డంపింగ్ యార్డ్ కు రెండు ఎకరాల స్థలం కేటాయించడం లోను, మరియు ఆదివారపు పేట వెళ్ళిదారిలో లేఅవుట్ ఫోర్ నందు సుమారు మూడున్నర కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడంలోనూ, ముఖ్యంగా భీమేశ్వర స్వామి వారి దేవాలయం ఎదురుగా మార్కెట్లో రథం వీధి వెడల్పు చేసి రెండు వైపులా డ్రైనేజీలతో నూతన సిమెంట్ రోడ్డు నిర్మించడంలోను మంత్రి ఎంతో కృషి చేశారన్నారు.ఆయన చేసిన పనుల్లో మరికొన్ని గ్రామంలో కొన్నిచోట్ల సిమెంట్ రోడ్లు కొన్ని చోట్ల డ్రనేజీలు,మంచినీటి పైపులైన్లు,డబ్ల్యూ బిఎం రోడ్లు ఇలా అనేకం ఉన్నాయని తెలియజేసారు.ఇదంతా కేవలం ఒక్క సంవత్సరం కాలంలోనే చేయగలగటం ఆయన సామర్థ్యానికి నిదర్శనం అని ద్రాక్షారామ ప్రజలందరి తరపున గ్రామ సర్పంచ్ గా ఆయనకు అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo