టిడిపి కి చెందిన షేక్ ఇబ్రహీం మండపేట మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మెన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ ఛైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ లుఆయన్ని అభినందించారు. మండపేట టిడిపి కార్యాలయంలో టీడీపీ మైనార్టీ నాయకులు సల్మాన్ హుస్సేన్ ఆధ్వర్యంలో షేక్ ఇబ్రహీం అక్కడికి చేరుకొని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే కు రుణ పడి ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ లు ఇబ్రహీం ను సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎండి కరీం , ఎండి అతవూర్ రెహమాన్ అల్తాఫ్, మెకానిక్ కరీం, సలీం, జొన్నపల్లి సూర్యారావు, గడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.