ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ…
మండపేట పట్టణం 26వ వార్డు దుర్గమ్మ గుడి వద్ద ఏకలవ్య జయంతి వేడుకలను ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ ఏకలవ్యుడి చరిత్ర మహోన్నతమైనదన్నారు. గురువుపై అపార భక్తిని చాటి తన బొటన వేలును త్యాగం చేసిన ఏకలవ్యుడు నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, 26వ వార్డు కౌన్సిలర్ అమలదాసు లక్ష్మి, కోనసీమ ఎరుకుల సంఘం జిల్లా సెక్రటరీ సమతం చిన్న పాపారావు, మండపేట మండల సంఘం అధ్యక్షులు అమలదాసు రుద్రమూర్తి, సెక్రటరీ సింగం రాంబాబు, అమలదాసు చిన్నబ్బులు, గోవిందు, అన్నవరం, సూర్యనారాయణ, మానుపూడి పాండవులు, సహదేవుడు, బీముడు తదితర్లు పాల్గొన్నారు…