- కొవ్వూరు పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం నందు కొవ్వూరు డివిజన్ పరిధిలోని అధికారి యంత్రాంగంతో సమీక్ష సమావేశం.
- వినాయక చవితి మండపాలను ఏర్పాటు చేసే కమిటీ సభ్యులు తప్పనిసరిగా అనుమతులు పొందాలి.
- నిమజ్జనం నిర్వహించే తేదీతో పాటు సమయాన్ని కూడా ముందుగా తెలియజేయాలి.
కొవ్వూరు డివిజన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించే కమిటీ సభ్యులు తప్పనిసరిగా పోలీస్ మరియు రెవెన్యూ ద్వారా తగిన అనుమతులను పొందవలెనని ఆర్డీవో రాణి సుస్మిత అన్నారు. వినాయక చవితి వేడుకలు సమీపిస్తున్న తరుణంలో శనివారం కొవ్వూరు పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం నందు కొవ్వూరు డివిజన్ పరిధిలోని అధికారి యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను నిర్వహించుకుంటారని ఇలాంటి నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండటంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తగిన ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. వినాయక చవితి మండపాలను ఏర్పాటు చేసే కమిటీ సభ్యులు తప్పనిసరిగా అనుమతులు పొందాలని నిమజ్జనం నిర్వహించే తేదీతో పాటు సమయాన్ని కూడా ముందుగా తెలియజేయాలని అన్నారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు నిబంధనలను అతిక్రమించి ఎవరు ప్రవర్తించిన తగిన చర్యలు తప్పమన్నారు ప్రజలు వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు డిఎస్పీ దేవ కుమార్ , కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఎమ్మార్వోలు, పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

