చవితి ఏర్పాట్లతో మండలంలో సందడి వాతావరణం
తొలి పూజతో మొదలు కానున్న నవరాత్రి ఉత్సవాలు
మండలంలో వినాయకచవితి సందడి మొదలైంది. మంగళవారం వాడవాడలా, వీధివీధిన విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు యువకులు పోటీపడుతూ విగ్రహాలను తీసుకువస్తున్నారు. చవితి రోజుకు అవసరమైన పండ్లు, గణపతి విగ్రహాలు, పత్రులు, పువ్వుల నిమిత్తం విద్యార్థులు,మహిళలు తరలి వస్తుండడంతో దుకాణాలు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. పలు గ్రామాల్లోని వీధుల్లో వినాయక మండపాల ఏర్పాట్లలో యువత నిమగ్నమయ్యారు.
బుధవారం జరిగే వినాయక చవితి వేడుకకు ప్రజలు సన్నద్ధమయ్యారు. తొలిపూజ తో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. మండలంలో తొమ్మిది రోజులపాటు కన్నులపండువగా గణేష్ ఉత్సవాలు నిర్వహించేందుకు భక్త,ఉత్సవ కమిటీల ప్రతినిధులు సిద్ధమయ్యారు. వినాయక విగ్రహాలను మండపాలకు తరలించేందుకు సోమవారం నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టడంతో వాడవాడలా పండుగ సందడి నెలకొంది. కాగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసులు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు