మండపేట పురవీధుల్లో గణనాథుడి శోభయాత్రతో భక్తులు పరవశం…
మండపేట లో శనివారం గణనాథుడి శోభయాత్ర ఉదయం నుండి సాగింది.9 రోజులు పాటు విఘ్నాలు తొలగించే విగ్నేశ్వరుడుని భక్తిశ్రద్ధలతో పూజించి విశేష పూజలు అందుకుని చివరి రోజైన శనివారం నాడు పట్టణ పురవీధుల్లో భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ గణనాథుడు నిమజ్జన ఘాట్లకు చేరుకున్నాయి. ఆదివారం చంద్రగ్రహణం ఏర్పడడంతో మండపేటలో వెలిసిన చిన్న పెద్ద అన్ని వినాయక ప్రతిమలను నిన్న శనివారం ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులుతో కలసి నిమజ్జనం చేయడం జరిగింది. మండపేటలో కొండపల్లి వారి వీధిలో 20 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు జరుపుతున్న ఉత్సవ కమిటీ సభ్యులు ఈ సంవత్సరం 18 అడుగులతో ఏర్పాటు చేసినటువంటి వరసిద్ధి వినాయకుడిని జొన్నాడలో ఏర్పాటు చేసినటువంటి ఘాట్లో నిమజ్జనం చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి.సురేష్ బాబు ముందస్తుగా ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తుతో గణనాధుడిని ఆయా కమిటి సభ్యులుతో కలసి నిమర్జనాలు చేశారు.