అధికారులు సమావేశం….
వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకుని గణేష్ విగ్రహాలు నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నట్లు మండపేట మండల తహసిల్దార్ తేజేశ్వరరావు పేర్కొన్నారు.తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు సమావేశం శనివారం నిర్వహించారు .మండపేట తహసిల్దార్ పి.తేజేశ్వర రావు,మండపేట టౌన్ సి ఐ డి.సురేశ్, మిగిలిన శాఖల అధికారులతో సమావేశం జరిగింది. మండపేట పెద్ద కాలువ వంతెన, మండపేట బై పాస్ రోడ్ వంతెన, వీరభద్రాపురం,పెడపర్తి రేవు , కేశవరం రైల్వే గేటు, మారేడుబాక వంతెన, ఇప్పనపాడు – తాపేశ్వరం లాకులు , ఏడిద సీతానగరం కాలువ అధిక సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. అర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో బారికేడ్లను జెండాలు ఏర్పాటు చేస్తారన్నారు.రూరల్ లో లైటింగ్, తాగునీరు,
పారిశుధ్యం, మైక్ అనౌన్స్మెంట్ పంచాయతీరాజ్ శాఖ కు అప్పగించారు. టౌన్ పరిధిలో మున్సిపాల్టీ ఆద్వర్యంలో ఏర్పాటు చేస్తారు. మత్యశాఖ ఆద్వర్యంలో ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, రెస్క్యూ టీమ్, రెడ్ ప్లగ్ ఏర్పాటు చేస్తారు.వైద్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్, అంబులెన్స్,ప్రథమ చికిత్స ఏర్పాటు చేస్తారు. ప్రజల భద్రత, శాంతి భద్రత పరిరక్షణ పోలీసులు నిర్వహిస్తారు. నీటి ప్రవాహం స్థాయి తదితర అంశాలు నీటి పారుదల శాఖ పర్యవేక్షిస్తారు. ప్లడ్ లైట్లు విద్యుత్ శాఖ ఏర్పాటు చేస్తుంది. అగ్ని మాపక దళం ఫైర్ ఇంజిన్ ను అందుబాటు లో ఉంచుతారన్నారు.ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ డి ఇ కె. సత్యనారాయణ మూర్తి, ఎంపిడిఓ సత్యనారాయణ, డిప్యూటీ ఎండీఓ డి.శ్రీనివాస్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కె.శ్రీనివాస్, డి.ఇ కే శ్రీనివాస్ రూరల్ ఎస్ ఐ వి.కిశోర్, ఫైర్ ఆఫీసర్ పి.లోవరాజు, బి.పురుషోత్తం, ఇరిగేషన్ ఎస్.కె. అహ్మద్ వలీ, విద్యుత్ శాఖ ఏ ఈ ఎం మోనీ, మత్స్య శాఖ సి.హెచ్. విశ్ని వర్మ, వైద్య శాఖ ఐ.వెంకట రమణ, పి.జగదీప్, వి.భవానీ, ఎన్.అనంత లక్ష్మి, డిప్యూటీ తహశీల్దార్ పి.ఎ. మెహర్ బాబా, జూనియర్ అసిస్టెంట్ కె.రఘు శ్రీధర్ పాల్గొన్నారు.

