లయన్స్ క్లబ్ ఔదార్యం
మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బుధవారం లయన్స్ క్లబ్ తాళ్ళరేవు ఆధ్వర్యంలో హాస్పిటల్ కు వచ్చే గర్భిణీ స్త్రీలకు అందజేశారు. ప్రతి బుధవారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు ఆహారం అందజేస్తున్నట్లు లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. బుధవారం సుమారు 50 మందికి పోషకాలతో కూడిన పౌష్టిక ఆహారాన్ని అందజేసినట్లు తాళ్లరేవు లయన్స్ క్లబ్ రీజియన్ చైర్ పర్సన్ బిళ్ళకుర్తి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ డైరెక్టర్, డాక్టర్లు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.