గర్భిణీ స్త్రీలకు పోషకాహారం పంపిణీ చేసిన : డాక్టర్ పుల్లా ప్రసాద్
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం లోని కరప మండలం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో శనివారం గర్భిణీ స్త్రీలకు మౌర్యా హాస్పిటల్ డాక్టర్ పుల్లాప్రసాద్ ఆధ్వర్యంలో పౌష్టిక ఆహారం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గర్భిణీ స్త్రీలకు ఈ సమయంలో పౌష్టికాహారం అవసరమని, మా వంతు సహాయంగా గర్భిణీ స్త్రీలకు పండ్లు, రొట్టెలు, పౌష్టికాలతో కూడిన ఆహారము అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కడప మెడికల్ ఆఫీసర్ అఫ్రోజ్, యేసు రత్నం, మంగా పరమేష్, పోలిశెట్టి తాతీలు, పేపకాయల తణుకు రాజు, మంచాల శ్రీను, నారాయణమ్మ, సీత తదితరులు పాల్గొన్నారు.