గరికిపాటి నరసింహారావు ప్రసంగాలు ఉత్తేజాన్నిస్తున్నాయి
మీరు చేస్తున్న ఆధ్యాత్మిక ప్రసంగాలు ఎంతో ఉత్తేజాన్నిస్తున్నాయని తద్వారా ఎంతోమందికి విజ్ఞానం లభిస్తుందని ప్రవచనకర్త గరికపాటి నరసింహ రావుతో జిల్లా యువజన సంఘాల సమాఖ్య కార్యదర్శి గేదెల శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఒక కార్యక్రమం నిమిత్తం కాకినాడ సూర్యకళా మందిరానికి వచ్చిన గరికపాటిని గేదెల మర్యాదపూర్వకంగా కలిశారు. ఉత్తేజితతో కూడిన ప్రసంగాలను ఆధ్యాత్మికంగా వివరిస్తున్న గరికపాటిని గేదెల అభినందించారు.