ఘనంగా ఐ డి పి ఎస్ స్కూల్లో ఇన్కమ్ టాక్స్ దినోత్సవ వేడుక లు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సమనస వద్దగల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో డైరెక్టర్ మను విహార్ ఆధ్వర్యంలో ఆదాయపు పన్ను దినోత్సవ వేడుకలు గురువారం నాడు ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆదాయ పన్ను శాఖ అధికారి జనపల్లి ఓం కృష్ణ విద్యార్థులతో మాట్లాడుతూ ఆదాయపు పన్ను దేశ అభివృద్ధికి తోడ్పడే విషయాల మీద ప్రత్యేక అవగాహన కల్పించారు సంపాదన ఉన్న ప్రతి ఒక్కరూ ఆదాయపు పన్ను కట్టడం వలన దేశ ఆర్థిక అభివృద్ధిని పెంపొందించవచ్చని ప్రతి పౌరుడు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఐ టి ఓ తెలిపారు
ఈ కార్యక్రమంలో స్కూల్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ నాయుడు డైరెక్టర్, ఇన్కమ్ టాక్స్ అధికారులు, భాస్కర్ నళిని అనిల్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు