అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామం మట్టపర్తి వారి పాలెంలో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం కాలెపు మోహన్ రావు అర్చకత్వాన మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలకు అమ్మవారి ప్రతిమ, గాజులు, రుద్రాక్ష , కాటన్ బ్యాగ్ కమిటీ వారు అందించారు
ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు కడలి రాజు, కడలి రామకృష్ణ, మట్టపర్తి అజయ్ , మట్టపర్తి వరప్రసాద్, మామిడిశెట్టి విష్ణుప్రసాద్, మట్టపర్తి శేష గిరిరావు, గ్రామ పెద్దలు మట్టపర్తి శ్రీనివాస్, దొమ్మేటి నరసింహారావు, మట్టపర్తి నాగేశ్వరావు, మట్టపర్తి బూరయ్య, మట్టపర్తి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

