ముఖ్య అతిథిగా జగ్గంపేట జనసేన పార్టీ నియోజక వర్గ
ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్
కాకినాడ జిల్లా జగ్గంపేటలో TV5 రిపోర్టర్ సుధాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తుమ్మలపల్లి రమేష్ హాజరై, కేక్ కట్ చేసి, స్వీట్లు తినిపిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుధాకర్‌ను శాలువాతో సత్కరించారు. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మీడియా రంగంలో మరింత అభివృద్ధి సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ పులి ప్రసాద్, బీఎస్పీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి జుత్తుక నాగేశ్వరరావు, జగ్గంపేట నియోజకవర్గ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు వాడపల్లి సీతారాం ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.