ఘన సన్మానాలు చేసిన అభిమానులు
విశ్వం వాయిస్ కాజులూరు
కాజులూరు మండల జనసేన పార్టీ నాయకుడు డేగల సతీష్ 39వ జన్మదిన వేడుకల్ని సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ మేరకు డేగలపేట, గొల్లపాలెం, ఆర్యవటం, విజయరాయుడుపాలెం, జగన్నాధగిరి, పెనుమళ్ళ, మంజేరు తదితర గ్రామాల్లో జనసైనికులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని కేక్ కటింగ్ లు చేశారు. ఈ సందర్బంగా అభిమానులు, కార్యకర్తలు సతీష్ ని పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాణాసంచా పేల్చి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు చుండ్రు వీర్రాజు చౌదరి, కొల్లి హనుమంతరావు, చందాల ఆదినారాయణ, కుక్కల ఆంజనేయులు, జనసేన నాయకులు పుల్లెపు ఆనంద్, పుల్లెపు సురేష్, ఎరుబండి నాని, నాగార్జున, యరకం నాగేశ్వరావు, చందాల త్రిమూర్తులు, మేడిశెట్టి వీరబాబు, చందాల వీరబాబు ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.