అభిమానుల ఆనందోత్సవాల మధ్య కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కొవ్వూరు పట్టణంలోని లిటరరీ క్లబ్ నందు కొవ్వూరు నియోజకవర్గం లోని నాయకులు కార్యకర్తలు అభిమానులు విశేషంగా పాల్గొని అభిమాన నాయకుడు ముప్పిడి వెంకటేశ్వరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల సమక్షంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కేకును కట్ చేసి అందరికీ అందించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ద్వి సభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ జొన్నలగడ్డ సుబ్బయ్య చౌదరి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సూరపనేని చిన్ని సూర్యదేవర రంజిత్ కుమార్ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు నాదెండ్ల శ్రీరామ్, కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు మద్దిపట్ల శివరామకృష్ణ, వట్టికూటి వెంకటేశ్వరరావు ,దాయన రామకృష్ణ, బొల్లిన నాగేంద్ర, కాకర్ల సత్యేంద్ర, కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు