రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.పట్టణ టీడీపీ అధ్యక్షులు మత్సా నాగబాబు ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు,కార్యకర్తలతో కలసి ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అందరి ఆధ్వర్యంలో ఆయన కేక్ కట్ చేసి ఎమ్మెల్యే వేగుళ్ళ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న తమ నాయకుడు వేగుళ్ళ జోగేశ్వరరావుకు అయరారోగ్యాలు కలగాలని కోరారు.అనంతరం పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు ఆధ్వర్యంలో ధర్మగుండం చెరువు వద్ద ఉన్న మయూరి వృద్దాశ్రమంలో వేగుళ్ళ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. తొలుత వృద్దులతో కలసి కేక్ కట్ చేసి వేగుళ్ళకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అందరికీ స్వీట్లు పంచారు.ఈ సందర్భంగా వృద్దులకు రాంబాబు భోజనాలు ఏర్పాటుచేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,పాల్గొన్నారు.

