ఘనంగా యేసురాజు జన్మదిన వేడుకలు
కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు గుబ్బల యేసురాజు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పలుచోట్ల కేకులు కట్ చేసి ఆయన వేడుకలు జరుపుకున్నారు. ఈ మేరకు పలువురు నాయకులు, కార్యకర్తలు యేసురాజుకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన్ని పూలదండలు, దుస్సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ టేకుముడి సత్యనారాయణ, టీడీపీ నాయకులు దంగేటి గౌరీశంకర్, వెంకటరమణ, బోమిడి సోమాలమ్మ, వి ధరణి, తోట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.