మండపేట రెండో వార్డు లోని గొల్లలగుంట ఏరియా లో ఏర్పాటు చేసిన శ్రీ మహా గణపతి మండపం వద్ద ఆదివారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు విశేష పూజలు నిర్వహించారు. వినాయక చవితి మండపం నిర్వాహకులు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ ఛైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, రెండో వార్డు కౌన్సిలర్ చిట్టూరి సతీష్ లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఆశీర్వాదం అందజేశారు. పూజల అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కు జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమం లో భక్తులు , అపార్ట్మెంట్ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

