విస్తృతం గా పోలీసులు గాలింపు…
కపిలేశ్వరపురం మండలం, కేదార్లంక గ్రామ పంచాయితీ వీధి వారి లంకకు చెందిన పల్లిచిట్టియ్య (65) తాతపూడి లంక కు వెళ్ళాడు. తిరిగి రాలేదు. గోదావరి లో పడిపోయాడని అనుమానిస్తున్నారు.లంక లోకి వెళ్ళి ప్రమాదవశాత్తు గోదావరి ప్రవాహం లో కొట్టుకొని పోయి వుంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న కపిలేశ్వరపురం తహసిల్దార్ శ్రీనివాస్ , రూరల్ సి ఐ దొరరాజు ఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల ను రప్పించి పడవల పై గోదావరి లో గాలిస్తున్నారు. ఎవరికైనా ఇతని గురించి ఆచూకీ తెలిస్తే అంగర ఎస్ ఐ 9440900770, మండపేట రూరల్ సి ఐ దొర రాజు
9440796537 నెంబర్ లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

