మండపేట ఏడిద రోడ్ లో శ్రీ లక్ష్మీ గణపతి గూడ్స్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం అన్న సమాధారాధన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డన చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ మెండు బాపిరాజు,యూనియన్ సభ్యులు లంక జాన్,పిల్లి శివ,వైస్సార్సీపీ నాయకులు వీరబాబు,కిషోర్, కొంకి వీరబాబు,షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.