కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన తనిఖీల్లో పోలీసులు మూగ జీవాల అక్రమ రవాణాను బయటపెట్టారు. గుమ్మిడికాయల లోడ్‌లో నిక్కచ్చిగా దాచిన రెండు ఆవులు, ఎనిమిది గిత్తలతో కూడిన మినీ వాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.జగ్గంపేట సీఐ వై.ఆర్.కే. శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్సై జి. సతీష్ కుమార్ నేతృత్వంలోని బృందం చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో ఈ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. వాహనాన్ని నిలిపివేసి లోతుగా పరిశీలించగా, గుమ్మిడికాయల మూటల క్రింద పశువులను దాచినట్లు గుర్తించారు.వెంటనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని వాహనంతో పాటు కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు