డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలం, పసలపూడి గ్రామంలో చైతన్య రైస్ మిల్ దగ్గరలో రోడ్డు పక్కన, సోమవారం ఉదయం సుమారు 70 సంవత్సరాల వయస్సు గల వృద్దుడు అపస్మారక స్థితిలో పడి ఉండడం చుట్టుపక్కల వారు చూసి,108 కి కాల్ చేసి రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కు తరలించి జాయిన్ చేయగా, ఆ వృద్ధుడు చికిత్స పొందుతూ సాయంత్రం చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని రాయవరం ఎస్సై సురేష్ బాబు తెలిపారు. మృతుని గూర్చి ఆయన తెలిపిన వివరాల మేరకు, వృద్ధుడి వయస్సు 65 నుంచి 70 సంవత్సరాల ఉంటుందని, అతడి వివరాలు తెలిసిన వారు రాయవరం పోలీస్ స్టేషన్ కు 9440904843 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ బాబు తెలిపారు.