టీడీపీ టౌన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు కరిముల్లాషా ఖాదరి హర్షం…
ముస్లింలు పవిత్రంగా భావించే హాజ్ యాత్ర చేసే యాత్రికులకు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయడం పట్ల హర్షం వ్యక్తపరిచిన టౌన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి కరీం.గత జూన్ నెలలో యాత్ర పూర్తి చేసి వచ్చిన హాజ్ యాత్రికులు 72 మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున 72 లక్షలు మంజూరు చేయడం జరిగిందని ముస్లింల అభ్యున్నతికి నిరంతరం పాటుపడే నాయకుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు.రాబోయే 2026 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుండి వెళ్లే హాజ్ యాత్రికులకు కూడా ఈ ఆర్థిక సాయం వర్తిస్తుందని,ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగిందని ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని అన్నారు.గతంలో మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని,ఎక్కడా లేని విధంగా ముస్లిం మైనార్టీలకు చెందిన మసీద్ ఇమామ్ లకు,మౌజన్ లకు గౌరవ వేతనాలు ఇవ్వడం జరుగుతుందని. అంతేకాకుండా మసీదులు, ఆషుర్ ఖానాలకు,దర్గాలకు,బరేయల్ గ్రౌండ్స్ కి అనేక ముస్లిం సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని ముస్లింలు అంతా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని కేవలం మండపేటలొనే గత తెలుగుదేశం ప్రభుత్వంలొ సుమరు 5 కోట్ల విలువ చేసే స్థలము కేటాయించడమే కాకుండా దాని నిర్మాణనికీ సుమారు 2 కోట్ల ఇవ్వటం జరిగిందని , మిగిలిన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేగుళ్ల త్వరలో నిధులు మంజురు చేయంచడం జరుగుతుందని తెలిపారు.