మండపేట పురపాలక సంఘం లో ఇంచార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న ముత్యాల సత్తిరాజు కు జిల్లా ఉత్తమ పురస్కారం అందింది. అమలాపురం లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా ఉత్తమ పురస్కారం ను ఆయనకు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ లచే అందుకున్నారు.గతంలో ఈయన ఇక్కడ పనిచేసినపుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లో పురస్కారం అందుకున్నారు.పారిశుధ్య నిర్వహణ లో అత్యుత్తమ సేవలు కు గాను ఈ పురస్కారం సత్తిరాజు కు లభించింది.ఆయనకు అవార్డు రావడం తో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ ఛైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, కమీషనర్ టివి రంగారావు లు అభినందించారు

