Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications

ఇద్దరు బాలికల ఆచూకీని ట్రేస్ చేసిన పోలీసులు. – ఇంద్ర పాలెం పోలీస్ స్టేషన్.

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఇద్దరు బాలికల ఆచూకీనితెలుసుకున్న పోలీసులు

సిబ్బందిని అభినందించిన సిఐ

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్

ఎస్ అచ్యుతాపురం నివాసి తంగేళ్ల సూర్య నాగమ్మ (భర్త నరసయ్య, 33 సం.) తమ కుమార్తె సోమవారం ఉదయం కళాశాలకు వెళ్లిన తర్వాత కనిపించకుండా, రామారావుపేట లోని సంజీవ్ జూనియర్ కాలేజ్ నుండి వెళ్లిపోయిన తంగెళ్ల లావణ్య మైనర్ కుమార్తె తో వెళ్లి పోయినదని తెలిసి రాత్రి పొద్దుపోయిన తర్వాత అందిన ఫిర్యాదుతో,ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎమ్. వీరబాబు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, కాకినాడ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అఫ్ పోలీసు పాటిల్ దేవరాజ్ మనీష్ ఆదేశాల మేరకు కాకినాడ రురల్ ఇన్స్పెక్టర్ డీఎస్. చైతన్య కృష్ణ సూచనల మేరకు, ఇంద్ర పాలెం పోలీస్ స్టేషన్ ఎస్సై ఎమ్. వీరబాబు, సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ మరియు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా బాలిక అమలాపురం వైపు వెళుతున్నట్లు గుర్తించి, అమలాపురం పోలీసుల సహకారాన్ని కోరారు. వారి సమన్వయంతో కూడిన కృషి ఫలితంగా, తప్పిపోయిన బాలికలను ఉదయం అమలాపురంలో కనుగొని, బాలికలును వారి తల్లిదండ్రులకు అప్పగించినారు. దీనిపై బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకున్నారు.కాకినాడ జిల్లా పోలీసులు చూపిన అప్రమత్తత, వేగవంతమైన చర్యలు మరియు ఇతర పోలీసు విభాగాలతో సమర్థవంతమైన సమన్వయంతో బాలికలును సురక్షితంగా గుర్తించి, కుటుంబానికి అప్పగించిన కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ మరియు ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎమ్. వీరబాబు, సిబ్బందిని ఎస్పీ అభినందించినారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo