అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల ప్రజలు అసహనం…
మండపేట పట్టణంలో సత్యశ్రీ థియేటర్ రోడ్డు మీదుగా రాజరత్న థియేటర్ నుండి దిబ్బగరువు ఎస్సీ పేట వరకు సిమెంట్ రోడ్డు కనుమరుగాయేనని స్థానికులు అందోళన వ్యక్తపరుస్తున్నారు. రాత్రింబవళ్ళు అతివేగంతో పోటాపోటీగా ఎర్ర గ్రావెల్ తరలింపు వల్ల ఎండలో దుమ్ము లేస్తే ఈ వర్షాలకు అది జారుడు బురదగా మారి వాహన చోధకులు పాదాచారులు ప్రమాదాలకి గురవుతున్నారు. వ్యాపార సముదాయాలకు కూడా ఇది పెద్ద సమస్యగా మారిందని అక్కడ వ్యాపారస్తులు గగ్గోలు పేడుతున్నారు. దళిత వాడల పట్ల ఇంత నిర్లక్ష్యమా అని దళితవాడ నాయకులు, ప్రజలు మరియు 8వ వార్డు వైసిపి కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ ఆవేదన వ్యక్తపరిచారు. అయినా సరే ఎటువంటి చలనం లేకుండా వ్యవహారిస్తున్న రోడ్డు మరియు భవనాల శాఖా, పట్టింపు లేని మున్సిపాలిటీ అధికారులు, పాలకులు తీరుపట్ల 5 వార్డుల ప్రజలు అసహనం వ్యక్తపరిచారు.