Thursday, July 31, 2025
Thursday, July 31, 2025

ఇష్టాగోష్టి లా సాగిన మండల సర్వసభ్య సమావేశం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

పలు శాఖల అధికారులు గైర్హాజరు

వెటర్నరీ శాఖలో అనుభవం లేని ఉద్యోగుల వలన సమస్యలు ఎదురవుతున్నాయి

సర్వ సభ్య సమావేశం లో ఎమ్మెల్యే వేగుళ్ళ..

విశ్వం వాయిస్ న్యూస్, , రాయవరం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో, మండల పరిషత్ అధ్యక్షులు నౌడు వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం సజావుగా సాగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు, మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు, కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు తమ తమ శాఖల ద్వారా మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను వివరించారు. వీటిపై ప్రజా ప్రతినిధులు పంచాయతీల పరిధిలో సమస్యలను లేవనెత్తి అధికారుల ను ప్రశ్నించగా, ప్రజా ప్రతినిధుల పక్షాన ఎమ్మెల్యే జోగేశ్వరరావు అధికారులను ప్రశ్నిస్తూ, ఆద్యంతం కార్యక్రమం ఇష్టాగోష్టి పద్ధతిలో సాగేలా నడిపించారు. ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డులు కలిగి, రేషన్ షాపు వద్దకు వెళ్లే అవకాశం లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులు,వికలాంగులకు ఎంతమందికి ఇంటి వద్దే రేషన్ అందిస్తున్నారని,ఆ వివరాలను సమర్పించాలన్నారు, ఎమ్మార్వో ఐపీ శెట్టి వివరణ ఇస్తూ తెల్ల రేషన్ కార్డులు నమోదు కొరకు 4500 అభ్యర్థులను అందాయని ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డు లు మంజూరు చేయ బడతాయని, వృద్ధుల,వికలాంగుల వివరాలు నివేదిక ఇస్తామని తెలిపారు, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా ఇప్పటివరకు ఒక విడత కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు జమ కాని వారి వివరాలు సేకరించి, సచివాలయ సిబ్బంది, గ్యాస్ ఏజెన్సీల సమన్వయంతో వారికి కేవైసీ చేయించి, ఆ పధకం అందేలా చూడాలని ఎమ్మెల్యే వేగుళ్ల సూచించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారితో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సంవత్సరం 6002 మంది రైతులకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందగా, ఈ సంవత్సరం 5022 మంది రైతులకే సహాయం అందుతుందనే వివరాల ప్రకారం. మిగిలిన రైతులు అనర్హులుగా ఉన్నారని, సరిచూసుకోవాలని, నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు, వారికి కూడా ఆ పధకం ద్వారా లబ్ధి చేకూరేలా ఎమ్మార్వో సమన్వయంతో ప్రయత్నం చేయాలని సంబంధిత వ్యవసాయ అధికారికి సూచించారు, ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న ప్రతి పథకాన్ని అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. వెటర్నరీ శాఖలో అనుభవం లేని ఉద్యోగుల వలన సమస్యలు ఎదురవుతున్నాయని సీనియర్ వెటర్నరీ డాక్టర్లు, జూనియర్లకు తర్ఫీదునిచ్చి వారు ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు, స్మార్ట్ మీటర్ల వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సాధారణం కంటే అధికంగా బిల్ వస్తుంది అని, కరెంటు బిల్లు చెల్లించడం కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజా ప్రతినిధులు తెలపగా, అధికారుల నుండి ఏ పని కావాలన్నా,సమస్యకు పరిష్కారం కావాలన్నా,కాగితంపై అప్లికేషన్ రూపంలో అందించి రసీదు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు, ఈ సందర్భంగా మండలంలో ఖాళీగా ఉన్న ఉద్యోగుల స్థానాలను భర్తీ చేయాలని అధికారులు ఎమ్మెల్యే ను కోరారు. 12 సంవత్సరాల లోపు విద్యార్థులకు ఉచిత బస్ పాస్ లు అందిస్తున్నామని,దివ్యాంగులకు రూ.100 తో బస్ పాస్ లు అందిస్తున్నామని ఆర్.టి.సి అధికారులు కార్యక్రమంలో తెలిపారు. గ్రామాల అభివృద్ధి విషయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఆలోచించి, అధికారులను ప్రశ్నిస్తూ, వారి ద్వారా గ్రామ,మండల అభివృద్ధి జరిగించుకోవాలని, ప్రజాప్రతినిధులకు వివరిస్తూ ఎమ్మెల్యే వేగుళ్ళ తమ హుందాతనం చాటుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, ఏ.ఎమ్.సి చైర్మన్ చింతపల్లి రామకృష్ణ లను దుశ్శాలువా కప్పి అధికారులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో అన్ని ఆయా శాఖల అధికారులు, రాయవరం మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసి లు,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
తూర్పు గోదావరి
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo