చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం…
మండపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ కార్మికులు సిబ్బంది జీతాలు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దీంతో సిబ్బంది సోమవారం మండపేట పురపాలక కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ వేతనాలు పెంచాలని సుమారు 2 నెలల సమ్మె చేపట్టామన్నారు.సమ్మె ద్వారా కార్మికుల జీతాలు సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.నెం.124 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డిపార్టుమెంటు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.కేటగిరి-I నకు రూ.3,000/-లు, కేటగిరి-IIనకు రూ.3,000/-లు కేటగిరి-IIIనకు రూ.3,500/-లుగా పెంపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అవుట్ సోర్సింగ్ కార్మికులు చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ వెన్నుండి ఈ జీతాలు పెరగడానికి కృషి చేసిన మండపేట నియోజకవర్గ శాసనసభ్యులు అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి లకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మండపేట పురపాలక సంఘ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ప్రెసిడెంట్ పాలపర్తి సుబ్బరాజు, కప్పల అన్నవరం, పాలచర్ల లీలా కృష్ణ, కె. సురేంద్ర, పాలపర్తి సురేష్ కన్నా, పిట్టా ప్రవీణ్ కుమార్, టి. వెంకన్న , రాజేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.