అపార్టుమెంట్లు 59 నుండి 66 బ్లాక్ లు వద్ద ఏర్పడిన వాటర్ పైప్ లైన్ లీకేజీ మరమ్మతుల పనులను మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశం లో అక్కడి ప్రజలు నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే చర్యలు చేపట్టినట్లు చెప్పారు.తమ సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ రాణి కు అక్కడి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమం లో అపార్ట్మెంట్ వాసులు కే విజయ దుర్గా, జ్యోతి, రజియా బేగం, రేష్మ, శ్రీదేవి, శ్రీనివాస్, కరీమున్నిసా, రబి యా , పద్మావతి,లక్ష్మి దుర్గా, లలిత, కుమారి, ప్రసాద్, భాను, శ్రీదేవి, గంగరాజు ,సత్తిబాబు దుర్గారావు, వరలక్ష్మి, సుబ్బలక్ష్మి రమేష్, రమణ కుమారి,మున్సిపల్,టిడ్కో, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

