Thursday, August 7, 2025
Thursday, August 7, 2025

డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా సరోజినీ సేవలు అభినందనీయం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

రహదారి సౌకర్యం లేని అటవీ ప్రాంతాల్లో సైతం సమర్థవంతంగా సేవలు

పదవీ విరమణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా వైద్య,ఆరోగ్య అధికారి

రాయవరం

డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎ.సరోజిని వైద్య,ఆరోగ్య శాఖలో చేసిన సేవలు ఎనలేనివని, రాయవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ రమ్యశ్రీ కొనియాడారు. 33 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా వివిధ హోదాలలో, ప్రజలకు నిస్వార్థ సేవలు అందించి రాయవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా జూన్ 29 ఆదివారం రోజున పదవీ విరమణ చేసిన అల్లంపల్లి సరోజిని ని మండల కేంద్రమైన రాయవరం గ్రామంలోని వెలమ కమ్యూనిటీ హాల్ నందు ఎంపీపీ నౌడు వెంకటరమణ అధ్యక్షతన జరిగిన పదవీ విరమణ సభలో ఘనంగా సత్కరించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం. దుర్గారావు దొర ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, రాష్ట్ర నలుమూలల నుండి సరోజినీ తో కలిసి పని చేసిన తోటి సిబ్బంది, అభిమానులు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొనగా,ముఖ్యంగా హెల్త్ ఎడ్యుకేటర్ల నుండి డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ గా పేరు మార్చబడడానికి సుదీర్ఘకాలం పోరాటం చేసామని, ఈ సమయంలో సరోజినీ అందించిన సహాయం,పడిన కష్టం, మరువలేనిదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరమణ తెలిపుతూ,రిటైర్మెంట్ చేరువలో ఉండగా, ఆ పోరాటం సఫలీకృతం అయిందని, సరోజినీ రిటైర్మెంట్ తో అనుబంధం తెంచుకుని ఆగిపోక, అసోసియేషన్ కు గౌరవ అధ్యక్షులుగా కొనసాగాలని సభాముఖంగా కోరారు, ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలైన బుట్టాయిగూడెం పరిసర గ్రామాలలో, రహదారి సౌకర్యం లేని చోట కూడా ఆమె విలువైన ఆరోగ్య సేవలు అందించారని,ఆ నిస్వార్థ సేవలు ప్రశంసనీయమని, ఆమె పనితనం స్ఫూర్తిదాయకమని గుర్తుచేశారు. ఈ కార్యక్రమం లో సరోజినీ జీవితం,పని విధానం గూర్చి ప్రారంభ పలుకులుగా ఉపాధ్యాయురాలు గరగ సీతామహాలక్ష్మి మాట్లాడిన పదాల అల్లిక  మంత్రముగ్ధులను చేయగా,డిహెచ్ఇఓ అసోసియేషన్ ట్రెజరర్ హరి ప్రసాద్ సరోజినీ పై రచించిన గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, అనంతరం డి ఎం హెచ్ ఓ దుర్గారావు దొర పదవి విరమణ పత్రాన్ని అందచేసి,దుశ్శాలువా కప్పి సన్మానం చేశారు, పదవీ విరమణ తరువాత ఆరోగ్యకర, ఆనందకరమైన జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చందమల్ల రామకృష్ణ, డాక్టర్ జి.ఎస్.ఎన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అసోసియేషన్  సెక్రటరీ సిహెచ్ సుధాకర్ రావు, స్టేట్ ట్రెజరర్ హరిప్రసాద్, మహిళా సెక్రటరీ వై అనురాధ, బేగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ స్టేట్ లీడర్ భానుమూర్తి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డి కృష్ణ శేఖర్,మాజీ ఏఎంసీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాసరావు,నదురుబాద గ్రామ సర్పంచ్ సిహెచ్. శ్రీనివాసరావు, లొల్ల గ్రామ సర్పంచ్ చాట్రాతి జానకి రాంబాబు, రాయవరం,మాచవరం,పెదపూడి ప్రాథమిక ఆరోగ్య  కేంద్రాల వైద్య సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తెలంగాణ
తూర్పు గోదావరి
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo