Friday, August 1, 2025
Friday, August 1, 2025

జగన్‌కు 3,500 కోట్ల లిక్కర్ స్కాంలో జైలు తప్పదు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

గత ప్రభుత్వ హయాంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్‌ విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జైలు తప్పదని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
2019 నుంచి 2024 మధ్య కాలంలో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా నాసిరకం మద్యం అమ్మకాలు జరిగాయని, దీంతో అనేకమంది ప్రాణాలు కోల్పోయినట్టు, చాలామంది వికలాంగులుగా, కిడ్నీ, లివర్ వ్యాధులతో బాధపడుతున్నారని నెహ్రూ పేర్కొన్నారు. ఈ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ స్కామ్‌లో కీలక పాత్ర పోషించిన మిధున్ రెడ్డిని ఎస్‌ఐటీ అధికారులు ఇప్పటికే విచారించి అరెస్టు చేయడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయని నెహ్రూ తెలిపారు. జగన్ మీడియా ముందు తప్పులేదన్నట్లుగా మాట్లాడటం గులికింతపూస మాటల్లా ఉంది. ఈ స్కామ్ మొత్తం మీ నేతృత్వంలోనే జరిగింది. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు, మీ మద్యం వాటాలు బయటపడ్డాయి అని ఆయన విమర్శించారు. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి ఈ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించారని, జగన్ కనుసన్నల్లోనే లిక్కర్ స్కామ్ సాగిందని ఆరోపించారు.కేబినెట్‌లో మద్యం పాలసీని ఆమోదించిన వారందరినీ విచారించాలని, ఈ వ్యవహారంతో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. స్కామ్‌లో దోషులైన వారందరినీ జైలుకు పంపే వరకు ఎస్‌ఐటీ వెనకడుగు వేయదని ఎమ్మెల్యే నెహ్రూ ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, సత్తి సదాశివరెడ్డి, కుంచే తాతాజీ, పాఠం శెట్టి నాగేశ్వరరావు, బద్ది సురేష్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo