జగ్గంపేటలోని ఏఎంటీ ఫిజియోథెరపీ క్లినిక్ ఆధ్వర్యంలో సోమవారం ఫిజియోథెరపీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా జగ్గంపేట హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న ఏఎంటి ఫిజియోథెరపీ క్లినిక్ నందు ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ శ్రీరామ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు శ్రీరామ్ ఉచితంగా వైద్య సేవలు, సలహాలు, సూచనలు, మందులను అందజేశారు.ఈ సందర్భంగా ఫిజియోథెరపీ వైద్యులు శ్రీరామ్ మాట్లాడుతూ ఆధునిక జీవనశైలిలో మనిషి అనేక రుగ్మతలకు గురవుతున్నాడని, మనిషికి సరైన వ్యాయామం,నిద్ర, శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలోని కండరాలు, నరాలు, ఎముకలకి సంబంధించిన వ్యాధుల గురవుతున్నారన్నారు.
ఈ వ్యాధుల నుంచి కోల్కొనేందుకు ఫిజియోథెరపీ చికిత్స కీలకపాత్ర పోషిస్తుందని శ్రీరామ్ తెలిపారు. ఫిజియోథెరపీతో కీళ్ల నొప్పులు, వైకల్యం కు సంబంధించిన వ్యాధుల చికిత్సలో సంజీవినిలా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేకును కట్ చేసి, క్లినిక్ కి విచ్చేసిన వారికి స్వీట్లు పంపిణీ చేశారు. ఫిజియోథెరపీ వైద్యులు శ్రీరామును ఘనంగా సత్కరించారు..ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి కొల్లా శ్రీనివాసరావు, జగ్గంపేట జనసేన మండల ఉపాధ్యక్షులు అచ్చే వీరబాబు, మొల్లేటి వెంకట ప్రసాద్ , వైసిపి నాయకులు ఉదయ్, సముద్ర ఫ్లెక్స్ గణేష్, లక్ష్మీ శాస్త్రి,జగ్గంపేట పరిసర ప్రాంత వాసులు పాల్గొన్నారు.