ఉపాధ్యాయులు సమాజానికి స్ఫూర్తి దాయకం…
ఉపాధ్యాయదినోత్సవం ను పురస్కరించుకొని జమాతె మహిళా విభాగం ఆధ్వర్యంలో మండపేట గాంధీనగర్ అల్-ఆమీన్ మస్జిద్ ప్రాంగణంలో ఆదివారం కార్యక్రమం నిర్వహించారు. మౌలానా జలాలుద్దీన్ ఉమ్రి అడిటోరియం హల్ లో సత్కారం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జమాతె మహిళా విభాగాపు అధ్యక్షురాలు అయేషా మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు.ఇస్లాం విద్యకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు విద్యావంతులే సత్ససమాజ నిర్మణాంలో భాగస్వాములవుతారని అన్నారు.అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి దివ్యఖుర్ఆన్ ను బహుకరించారు.ఈ కార్యక్రమంలో ఆధిక సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు, జమాతె మహిళా సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.