14 October 2025
Tuesday, October 14, 2025

జన జాగృతి రథం ద్వారా చట్టాలపై అవగాహన

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట

చట్టాలపై అవగాహన పెంపొందించుకొని ప్రజలంతా జాగృతం కావాలని ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి పిలుపు నిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బీ కృష్ణారావు ఇటీవల ప్రారంభించిన జన జాగృతి రథం ద్వారా చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజల్లో మాదకద్రవ్యాల వాడకాన్ని నివారించే చర్యలు, సైబర్ నేరాలపై జాగ్రత్తలు, మహిళల పట్ల గౌరవంగా నడుచుకోవడం వంటి అంశాలపై ఈ రథం ద్వారా అవగాహన కల్పిస్తామని వివరించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి చట్ట విరుద్ధమైన పనులకు దూరంగా ఉండాలని రామచంద్రపురం ట్రైనింగ్ డీఎస్పీ ప్రదీప్తి అన్నారు. జిల్లాలో మొదటిసారిగా మండపేట మండలం జెడ్ మేడపాడు సెంటర్లో ఆదివారం రూరల్ ఎస్సై వీ కిషోర్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ప్రజలు ఈ రథం ద్వారా అందించే సందేశాలను గమనించి, నేరాల నుండి దూరంగా ఉండాలని డీఎస్పీ పిలుపునిచ్చారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo