పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ , సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మామిడి కుదురు మండలం పార్సల్పూర్ గ్రామానికి చెందిన తుండురీ బుజ్జి ని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీకి అనేక సంవత్సరాలుగా అంకితభావంతో సేవలందిస్తున్న బుజ్జి ఆరోగ్యవంతులై తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు.

