Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications
Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో జర్నలిస్టులు కదం తొక్కారు.

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో జర్నలిస్టులు కదం తొక్కారు.

 

కాకినాడలో కదంతొక్కిన జర్నలిస్టులు

కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో నిరసన

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో జర్నలిస్టులు కదం తొక్కారు.

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ సిటీ

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) పిలుపు మేరకు సోమవారం డిమాండ్స్ డే నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి జర్నలిస్టులు కలెక్టరేట్ కు చేరుకొని అక్కడ నిరసన వ్యక్తం చేసి రాస్తారోకో చేపట్టారు. రాస్తారోకో సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా చేరుకోవడంతో అక్కడ ఉన్న పోలీసులు జర్నలిస్టులను సమన్వయం చేస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిరసన తెలియజేయాలని తెలపడంతో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం కలెక్టర్ షన్మోహన్ కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వాతాడ నవీన్ రాజ్, కార్యదర్శి ముమ్మిడి లక్ష్మణ్ మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాల వైఖరి మారాలని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలు ఇస్తామని జీఓలు విడుదల చేస్తూ దానిని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. చివరికి అక్రిడిటేషన్లు ప్రతీ ఏడాది ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. అనేక రాష్ట్రాలలో సీనియర్ జర్నలిస్టులకు ఫెన్షన్ సదుపాయం ఇస్తున్నందున ఇక్కడ కూడా వెంటనే అమలు చేయాలని, ఇప్సటికైనా జిల్లాలోని జర్నలిస్టులు అందరికి ఇళ్ళ స్ధలాలు ఇవ్వాలని, వెంటనే అక్రిడిటేషన్ల జీఓ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు ఎండి అధికార్, జి. శోభన్ బాబు, డి శ్రీధర్, పుర్రే త్రినాధ్, వల్లూరి నానాజీ, బాబీ, సత్తిబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, జగ్గంపేట నియోజకవర్గ అధ్యక్షులు వీరభద్రరావు, కార్యదర్శి పండు, పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షులు సత్య, పెద్దాపురం నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి, తుని నియోజకవర్గ నాయకులు బి. ప్రవీణ్, పడాల ప్రసాద్, లోవరాజు, తాళ్ళరేవు నాయకులు మల్లేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

వైసిపి నాయకులు మద్దతు… ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) చేపట్టిన డిమాండ్స్ డే కు వైసిపి జిల్లా నాయకులు మద్దతు ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు సంక్షేమంపై అంతా తయారు చేశారని, కానీ మరలా వైసిపి ప్రభుత్వం రాకపోవడంతో కనీసం తయారు చేసిన ఫైల్ ను చూసేందుకు కూటమి ప్రభుత్వానికి సమయం లేకపోవడంతో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని, జర్నలిస్టుల న్యాయపరమైన డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని జర్నలిస్టుల ఆందోళనకు వైసీపీ తరఫున మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. మద్దతు ప్రకటించిన వారిలో వైసిపి కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీతవిశ్వనాథ్, మాజీ మంత్రి తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, దవులూరి దొరబాబు కాకినాడ సిటీ వైసిపి నాయకులు ఉన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
తెలంగాణ
తూర్పు గోదావరి
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
వనిత వాయిస్
కృష్ణా
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo