45 మంది పేకాటరాయుళ్లకు జరిమానా
జగ్గంపేట మరియు గండేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న 45 మందిని పోలీసులు అదుపులో కి తీసుకుని పెద్దాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం ప్రతి ఒక్కరిపై రూ.300 చొప్పున జరిమానా విధించి, మొత్తం రూ.13,500/- వసూలు చేశారు.ఈ సందర్భంగా జగ్గంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.ఆర్.కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, సర్కిల్ పరిధిలో ఎవరైనా జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.