జగ్గంపేటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల నూతన ప్రిన్సిపాల్‌గా శనివారం జీవి లలిత కుమారి బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆమె రాజమండ్రిలోని గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా సేవలందించిన అనుభవం ఉంది.ఇప్పటివరకు ఈ పాఠశాలలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన రాజకుమారి చొల్లంగి బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రిన్సిపాల్ లలిత కుమారి మాట్లాడుతూ విద్యార్థులను అభ్యున్నత మార్గంలో తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తాను. వసతి గృహంలో ఉండే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే కాకుండా, వారి ఆరోగ్యాన్ని కూడా ప్రతిరోజూ పర్యవేక్షిస్తాను అని తెలిపారు.ఆమెను పాఠశాల ఉపాధ్యాయులు పూల గుచ్చంతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. విద్య, శిక్షణల విషయంలో పాఠశాల మరింత ముందుకు సాగుతుందని సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు.
జగ్గంపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలకు కొత్త ప్రిన్సిపాల్‌గా జీవి లలిత కుమారి బాధ్యతలు స్వీకరణ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
రచయిత నుండి మరిన్ని
సంబంధిత వార్తలు
