మండపేట టిడిపి ముస్లిం మైనార్టీ లు జిల్లా బిజెపి అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ను సత్కరించారు.మండపేట లో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా మండపేట కలువపువ్వు సెంటర్ లోని జామియా మస్జిద్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర టిడిపి మైనార్టీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్ షాప్ కు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ను మండపేట తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఎండి కరీం ఖాదరి స్వాగతం పలికి దుశాలువతో సత్కరించారు.జాతీయ అధికారిక భాష హిందీ సలహా కమిటీ సభ్యులు షంసు సాదిక్, చాట్రాతి జానకి రాంబాబు లొల్ల,బీజేపీ రాజోలు నియోజకవర్గం కన్వీనర్ అడబాల రాంబాబు, సల్మాన్ హుస్సేన్ పాల్గొన్నారు.