లొల్ల గ్రామంలో సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం
వరి కోత ప్రయోగాల పై రైతు సేవా కేంద్ర సిబ్బందికి శిక్షణా కార్యక్రమం
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
- దేశ వ్యాప్తంగా ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తూ, కేంద్ర ప్రభుత్వం నూతనంగా తగ్గించిన జి.ఎస్.టి ధరలతో అన్ని వస్తువులతో పాటు వ్యవసాయ పరికరాల ధరలు సైతం తగ్గాయని రాయవరం మండల వ్యవసాయ అధికారి కెవిఎన్ రమేష్ కుమార్ తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా, రాయవరం మండలం, లొల్ల గ్రామంలో జరిగిన సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ పరికరాల పై తగ్గిన పన్ను వివరాలను రైతులకు వివరిస్తూ, జిఎస్టి తగ్గింపు ద్వారా వ్యవసాయ పరికరాల ధరలలో మార్పులు సంతరించుకోవడం ద్వారా వ్యవసాయానికి ఉపయోగించే డ్రోన్ ధర సుమారు రూ.50,000 వరకూ తగ్గిందని, ట్రాక్టర్ల ధరతో పాటు ఇంజన్ ఆయిల్ ధరలు కూడా తగ్గాయని ఎమ్.ఎ.ఒ రమేష్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా లొల్ల గ్రామ సర్పంచ్ చాట్రాతి జానకి రాంబాబు మాట్లాడుతూ జిఎస్టీ తగ్గింపు కారణంగా ప్రజల్లో కొనుగోలు చేసేవారి శాతం పెరిగిందని తెలిపారు.
అనంతరం డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ వీరభద్రరావు పంట కోత ప్రయోగాల నిర్వహణ గూర్చి రాయవరం మండలం లోని రైతు సేవా కేంద్రం సిబ్బందికి, సోమేశ్వరంలో గల రైతు సేవా కేంద్రంలో శిక్షణ ఇచ్చారు. పంట కోత ప్రయోగాలు దిగుబడి ఆధారంగా రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తారని, అందుకు గత 5 సంవత్సరాల పంట కోత ప్రయోగాలు దిగుబడిని ప్రామాణికంగా తీసుకుని నష్ట పరిహారం నిర్ధారిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి అధ్యక్షులు సుంకవల్లి గంగరాజు, నీటి సంఘం అధ్యక్షులు లంక శ్రీను, రైతులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఎ.ఎస్.ఒ గాయత్రి దేవి, ఎ.ఇ.ఒ ఎ. శివ శంకర్ పాల్గొన్నారు.