ఎల్.సి.ఈ.ఎఫ్ నేషనల్ ఫౌండేషన్ జాతీయ ఆధ్యాత్మిక సాంస్కృట్ వారి ఆధ్వర్యంలో శ్రీ రామా సత్యనారాయణ స్వామి (అన్నవరం)వారి దేవస్థానం లో జరిగిన కార్యక్రమంలో శివసాయి కూచిపూడి నృత్య కళా క్షేత్రం నిర్వహకురాలు తణుకు సాయి మాదవికి జాతీయ న్యాయ చంద్రిక పురస్కారం దక్కించుకోవటం పట్ల కూచిపూడి విద్యార్థిణిలు వారి ఆనందాలను వ్యక్తం చేశారు.
ఆమెకు దక్కిన పురష్కారం కూచిపూడి నృత్యానికి వన్నె తెచ్చిపెట్టిందని , ఆమెకు దక్కిన పురష్కారం ఇంటర్నెషనల్ వరల్డ్ రికార్డ్ ల్లో ఒక్కటని,ఆమె ఎంతో పురాతన మైన సాహితి నగరం రాజమంద్రి వాసి కావటం మన నగర ప్రతిష్ట కు ముత్యాల హారం వంటిదని,ఆమె ఎంతో మంది చిన్నారులను కూచిపూడి శిక్షణలో త్వర్పిదు నిచ్చి జాతీయ స్థాయిలో ప్రతిభను చాటిన ఘనత ఆమెదని,కళా తప్పశ్వి తణుకు సాయి మాదవి ఎంతో మంది చిన్నారులను కూచిపూడి లో మంచి స్థానాలకు తీసుకెళ్లిన ప్రతిభ ఆమె సొంతం అని,విద్యార్థిణిల తల్లిదండ్రులు ఆమె సేవలను ఒక్కరోక్కరిగా కొనియాడారు. సాంప్రదాయక శాస్త్రీయ కళల్లో ఒక్కటైన కూచిపూడి నృత్యాన్ని వాడ వాడలా వ్యాప్తి చెందే విధంగా ఆమె చేస్తున్న కృషి వెలకట్ట లేనిదని వారు ఆమెను కితాబులతో ముంచేత్తారు.
ఆమెకు దక్కిన పురష్కారంలో విద్యార్థిణిలు, వారి తల్లిదండ్రులు కొంతమంది గురువులు పాల్గొని ఆమెను దుస్సాలువాలతోను పూల మాలల తోను సత్కరించి మెమోంటోలను బహుకరించారు.
అనంతరం సాయి మాదవి విద్యార్థి అయిన
చిరంజీవి సి.హెచ్. ” అభి ” శ్రీశ్రీ అన్నవరం శ్రీ రామా సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో నృత్య ప్రదర్శన చేసి పలువురును ఆకట్టుకుంది.అభి
తో పాటుగా పలువురు నృత్య విద్యార్థిణిలు సాయి మాదవి గారి ఆశీస్సులు పొందారు.గురువుల ఆశీర్వచనాలు దక్కించుకున్నారు.