పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు విధిగా వేయించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గోకవరం మండలం కృష్ణుని పాలెం గోపికృష్ణ ఫంక్షన్ హాల్ ఆవరణలో గోకవరం పశు వైద్యశాల వైద్యులు డాక్టర్ లోకేష్ ఆధ్వర్యంలో జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం, గాలికుంటు వ్యాధి నిరోధిక టీకాలు కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై పోస్టల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు ఈ టీకాలనుప్రతి ఇంటింటికి వెళ్లి పశువులకు టీకాలను వేయడం జరుగుతుందని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. గాలికుంటు వ్యాధి నివారణ టీకాల లను పాడి రైతులు తప్పకుండా వేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్ కుమార్, గోకవరం సొసైటీ చైర్మన్ గాజింగం సత్తిబాబు, మాజీ జడ్పిటిసి సభ్యులు పాలూరి బోసు బాబు, టిడిపి నాయకులు పోసిన ప్రసాద్, భూపతిపాలెం రెసిడెన్షియల్ స్కూల్ చైర్మన్ గల్లా రాము, మల్లవరం ఎంపీటీసీ మరిసే అప్పారావు, యర్రంపాలెం పశువైద్యశాల డాక్టర్ అన్నపూర్ణ నాయుడు, కామరాజుపేట ఏ హెచ్ ఏ సురేష్, గుమ్మల్ల దొడ్డి ఏ హెచ్ ఏ వీరబాబు వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు.