జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండల పరిధిలోని సుబ్బారాయుడు దిమ్మ వద్ద ఆదివారం రాత్రి రెండుద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కాట్రేనికోన మండలానికి చెందిన మరియుతాళ్ళరేవు మండలానికి చెందిన వ్యక్తులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి స్థానిక కోరింగ ఎస్సై పి సత్యనారాయణ మరియు సిబ్బందితో కలిసి హటాహుటిన చేరుకుని ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.